శబరిమల అంశంలో సుప్రీం జోక్యం అభ్యంతరకరం : రాజీవ్ చంద్రశేఖర్
- February 08, 2016
కేరళలోని ప్రఖ్యాత శబరిమల దేవాలయంలో మహిళలకు ప్రవేశం కల్పించే అంశంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకునే చర్య అభ్యంతరకరమని రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ప్రాచీన హిందూ సంప్రదాయాలు, విలువలను గౌరవించాలని కోరారు. 22 ఏళ్లుగా అంతరాయం లేకుండా శబరిమలను దర్శిస్తున్న ఒక భక్తుడిగా.. పూర్వకాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలు, ఆచారాల్లో సుప్రీం కోర్టు జోక్యాన్ని అభ్యంతరకరంగా భావిస్తున్నట్లు ఎంపీ చంద్రశేఖర్ ప్రకటించారు.
ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జనవరి 11న సుప్రీం కోర్టు విచారించింది. రుతుక్రమంలో ఉన్న మహిళలను ఆలయం ప్రవేశం చేయకుండా నిషేధించడం రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయ పడింది. మహిళలకు ఎందుకు ఆలయ ప్రవేశం కల్పించడం లేదనే ప్రశ్నకు స్పందించిన ఎంపీ చంద్రశేకర్... చాలా సందర్భాల్లో పూర్వకాలపు సంప్రదాయాలు, ఆచారాలు నవీన పద్ధతులు, పరీక్షలను అంగీకరించవని.. వాటిని గౌరవించాలని అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







