అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన కొత్తిమీర
- February 08, 2016
ఏ వంట చేసినా.. నేనున్నానంటూ ఘుమఘుమల సువానస తీసుకొస్తుంది కొత్తిమీర. కూరలైనా.. చారులైనా.. సాంబారైనా.. పులావు అయినా.. చికెన్.. మటన్ ఏ మాంసాహారానికైనా.. చక్కటి సువాసన.. కమ్మని రుచిని అందిస్తుంది కొత్తిమీర. ఏ వంటకం వండినా.. కాస్తనైనా కొత్తిమీర ఘాటు తగలాల్సిందే అంటారు. వంటకాల్లో అంతటి గొప్ప స్థానం సంపాదించుకుంది కొత్తిమీర.రెగ్యులర్ డైట్ లో ధనియాల అవసరమేంటి ?కొత్తిమీర సువాసనను మాత్రమే కాదు.. దీన్ని తరచూ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కొత్తిమీరలో పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ సి, విటమిన్ ఎలు కూడా కొత్తిమీర ద్వారా పొందవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడతాయి. అంతేకాదు.. బరువు తగ్గడానికి కూడా కొత్తిమీర సహాయపడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. అందరికీ అందుబాటులో ఉండే.. కొత్తిమీరతో పొందే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం...జీర్ణవ్యవస్థ: జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడటానికి కొత్తిమీర సహకరిస్తుంది. అలాగే మధుమేహంతో బాధపడేవాళ్లకు కొత్తిమీర మంచి ఔషధం. రక్తంలోని చక్కెర నిల్వల్ని తగ్గిస్తుంది. కొత్తిమీరను ఇష్టపడేవాళ్లు దాని రసం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.కొలెస్ర్టాల్: కొత్తిమీరలో పీచు ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం, ఇనుము, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సితోపాటు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. దీన్ని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలో హానికారక కొవ్వు కరుగుతుంది.సహజ వైద్యాన్ని అందించే ఏడు మూలికలు అల్జీమర్స్: కొత్తిమీరలో విటమిన్ కె ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఇది అల్జీమర్స్ వ్యాధి నుంచి కాపాడుతుంది. వయసు పెరిగేకొద్దీ వచ్చే మతిమరుపు వ్యాధిని నియంత్రించడంలో కొత్తిమీర కీలకపాత్రపోషిస్తుంది.కీళ్ల నొప్పులు: కొత్తిమీరలో కొవ్వుని కరిగించే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.ఇన్ఫెక్షన్స్: కొత్తిమీరలో రుచి మాత్రమే కాదు గాయాలను తగ్గించే రెమిడీ కూడా ఉంది. కొత్తిమీరలో యాంటీ సెప్టిక్ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇవి నోటి పూత, నెలసరి ఇబ్బందులు, గాయాలు త్వరగా మానేలా చేస్తాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









