మంగళ, బుధవారాల్లో జేపీ నడ్డా పర్యటన
- February 08, 2016
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా మంగళ, బుధవారాల్లో నల్గొండ, వరంగల్ జిల్లాలో పర్యటించనున్నట్లు భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం మంత్రి మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడలో ఫ్లోరైడ్ బాధితుల కుటుంబాలను కలసి చర్చిస్తారు. అదే రోజు సాయంత్రం చౌటుప్పల్‌లో చేనేత కార్మికుల కుటుంబాలతో సమావేశమై రాత్రి యాదగిరిగుట్టలో బస చేస్తారు. బుధవారం ఆలేరులో వివిధ కులవృత్తుల వారితో సమావేశమై సమస్యలు తెలుసుకుంటారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







