కొత్త మలుపును తీసుకురాగల చిప్..
- February 08, 2016
ఇంటర్నెట్ వినియోగంలో కొత్త మలుపును తీసుకురాగల సామర్థ్యమున్న చిప్‌ను అమెరికాలోని 'మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' శాస్త్రవేత్తలు రూపొందించారు. మనిషి మెదడును పోలి ఉండే 'న్యూరల్ నెట్‌వర్క్స్'ను ఏర్పాటు చేయటం ఈ చిప్ ప్రత్యేకత. దీని పేరు ఐరిస్. ప్రస్తుతం సెల్‌ఫోన్లలో ఉపయోగించే 'గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్' (జీపీయూ)కన్నా ఇది పదిరెట్లు శక్తిమంతమైనది. కాబట్టి దీనిని సెల్‌ఫోన్ వంటి మొబైల్ పరికరాల్లో వినియోగిస్తే.. అవి సంక్లిష్టమైన కృత్రిమమేధస్సు అల్గారిథమ్స్‌ను విశ్లేషించే సామర్థ్యాన్ని సంతరించుకుంటాయని ఈ పరిశోధనలో పాల్గొన్న వివియెన్‌స్జ్ తెలిపారు.ప్రస్తుతం ఈ పని చేయాలంటే ప్రత్యేకంగా ఇంటర్నెట్‌కు అప్‌లోడ్ చేయాల్సి వస్తోంది. కొత్తచిప్ 'ఐరిస్' ద్వారా ఆ పని సెల్‌ఫోన్‌లోనే జరిగిపోతుంది. కృత్రిమమేధో అల్గారిథమ్స్‌ను.. వస్తువుల గుర్తింపు, మనుష్యుల ముఖం, గొంతు గుర్తింపు వంటి అప్లికేషన్లలో ఉపయోగిస్తున్నారు. ఈ అల్గారిథమ్స్‌ను ఐరిస్ విశ్లేషించగలదు కాబట్టి.. సెల్‌ఫోన్‌లోనే ఈ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







