టెనెన్సీ అగ్రిమెంట్‌ ఫీజు పెంపు

- February 08, 2016 , by Maagulf
టెనెన్సీ అగ్రిమెంట్‌ ఫీజు పెంపు

మస్కట్‌ తర్వాత దోహా సహా దేశంలోని మిగతా చోట్ల టెనెన్సీ అగ్రిమెంట్స్‌ పీజును 3 నుంచి 5 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ల్యాండ్‌ లార్డ్స్‌ ఇక నుంచి 5 శాతం లీజు వాల్యూని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. తాజా నిర్ణయంతో చాలా అంశాలు చట్టబద్ధమవుతాయని ఓ రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌, టెనెన్సీ అగ్రిమెంట్‌ పీజు పెంపును ఆహ్వానించారు. చట్టబద్ధమైన అప్రూవల్స్‌ విషయంలో కొందరు రియల్‌ ఎస్టేట్‌ ఓనర్లు సుముఖత వ్యక్తం చేయకుండా అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారనీ, అలాంటి కార్యకలాపాలకు చెక్‌ పడుతుందని ఆయన చెప్పారు. ఇది ప్రాపర్టీ కొనుగోలు చేసేవారికి మేలు కలిగిస్తుందని ఆ రియల్‌ ఎస్టేట్‌ ఎజెంట్‌ వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com