ఆన్‌లైన్‌లో సాలిక్ ట్యాగ్స్
- February 08, 2016
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఏ) సాలిక్ సబ్‌స్క్రిప్షన్ ట్యాగ్స్ ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చని ప్రకటించింది. టోల్‌గేట్ పోర్టల్ ద్వారా సాలిక్ ట్యాగ్స్ వాహనదారులకు అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించి విస్తృతంగా అవగాహన పెంచే కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. మీడియా క్యాంపెయిన్ ఫిబ్రవరి 9 నుంచి 22 వరకు జరుగుతుంది. దుబాయ్‌లో రిజిస్టర్ అయిన వెహికిల్స్‌కి ఆన్‌లైన్ ద్వారా సాలిక్ ట్యాగ్స్ కొనుగోలు చేసే అవకాశం ఉందనీ, వేరే ఎమిరేట్స్‌లో రిజిస్టర్ అయిన వాహనాలకు ప్రస్తుతం ఉన్న రిటైల్ నెట్ వర్క్ ద్వారానే సాలిక్ ట్యాగ్స్ కొనుగోలు చేయవలసి వస్తుందని ఆర్‌టిఏ ట్రాఫిక్ అండ్ రోడ్స్ ఏజెన్సీ సీఈఓ మైతా బిన్ ఉదాయ్ చెప్పారు. తగిన వివరాలతో ఆన్‌లైన్‌లో సాలిక్ ట్యాగ్స్ కొనుగోలు చేసినవారికి, వారి మెయిలింగ్ అడ్రస్‌కి సాలిక్ ట్యాగ్స్ పంపించబడ్తాయని ఆమె అన్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







