‘వ‌కీల్ సాబ్’ మోష‌న్ పోస్ట‌ర్ విడుదల

- September 02, 2020 , by Maagulf
‘వ‌కీల్ సాబ్’ మోష‌న్ పోస్ట‌ర్ విడుదల

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడు. ప‌వ‌న్‌కళ్యాణ్ పుట్టిన‌రోజు(సెప్టెంబ‌ర్ 2) సంద‌ర్భంగా ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఒక వైపు మ‌హాత్మాగాంధీ ఫొటో, మ‌రో వైపు అంబేద్క‌ర్ ఫొటో మ‌ధ్య ప‌వ‌న్ లాయ‌ర్ కోటు వేసుకుని నిల‌బడ్డారు. ఓ చేతిలో బేస్‌బాల్ స్టిక్‌, మ‌రో చేతిలో క్రిమిన‌ల్ లా అనే పుస్త‌కం ప‌ట్టుకుని ప‌వ‌న్ ఠీవిగా నిల‌బ‌డి ఉన్నలుక్‌తో ఉండేలా మోష‌న్ పోస్ట‌ర్ ప్రేక్ష‌కాభిమానుల అంచ‌నాల‌ను మించేలా ఉంది. ఈ మోష‌న్ పోస్ట‌ర్ బ్యాగ్రౌండ్‌లో స‌త్య‌మేవ జ‌య‌తే ... అనే బీట్ వినిపిస్తుంది. 

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ ‘‘పవర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్‌గారి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌డం హ్యాపీగా ఉంది. ఆయ‌న అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు కోరుకునేలా ఓ ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్ పాత్ర‌లో ప‌వ‌న్‌కళ్యాణ్ గారు క‌నిపించ‌బోతున్నారు. క‌రోనా వైర‌స్ ప‌రిస్థితులు కాస్త చ‌క్క‌బ‌డ్డ త‌ర్వాత మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసి సినిమాను వీలైనంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. 

ఈ చిత్రానికి సంగీతం:  ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ:  పి.ఎస్‌.వినోద్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  రాజీవ‌న్‌, ఎడిటింగ్‌:  ప్ర‌వీణ్ పూడి, డైలాగ్స్‌:  తిరు, యాక్ష‌న్ ర‌వివ‌ర్మ‌, వి.ఎఫ్‌.ఎక్స్‌:  యుగంధ‌ర్‌, కో ప్రొడ్యూస‌ర్‌:  హ‌ర్షిత్ రెడ్డి, స‌మ‌ర్ప‌ణ‌:  బోనీ క‌పూర్‌, నిర్మాత‌లు:  దిల్‌రాజు, శిరీష్ , ద‌ర్శ‌క‌త్వం:   శ్రీరామ్ వేణు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com