ఉపాధ్యాయిల సహాకారంతోనే ప్రగతిశీల సమాజం:ఏ.పి గవర్నర్
- September 04, 2020
విజయవాడ:డా.సర్వేపల్లి జన్మదినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయిలకు శుభాకాంక్షలు తెలిపిన ఏ.పి గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్.ఉపాధ్యాయులు సమాజం యొక్క వాస్తుశిల్పులని, భారతావని నిర్మాణంలో వారి భూమిక ఎంచదగినదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. ఉపాధ్యాయిల సహకారం లేకుండా ఏ సమాజం ప్రగతిశీల మార్గంలో పయనించలేదని పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గవర్నర్ శ్రీ హరిచందన్ ఒక సందేశంలో రాష్ట్రంలోని ఉపాధ్యాయ సమాజానికి తన శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా, భారత రెండవ రాష్ట్రపతిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి అందించిన సేవలకు గౌరవార్థంగా, ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 5ను ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని బిశ్వ భూషణ్ ప్రస్తుతించారు. డాక్టర్ రాధాకృష్ణన్ ఆదర్శవంతమైన విద్యావేత్త, పండితునిగానే కాక తత్వవేత్తగా, రచయితగా భారత దేశానికి సేవలు అందించారన్నారు. సర్వేపల్లి తన జీవితంలో ఉన్నత నైతిక విలువలకు కట్టుబడిన మహనీయిడని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కొనియాడారు. ఈ మేరకు రాజ్ భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







