ఐపీఎల్ లో సూపర్ కింగ్స్ కి మరో ఎదురుదెబ్బ..టోర్ని నుంచి తప్పుకున్న హర్భజన్ సింగ్
- September 04, 2020
యూఏఈ:చెన్నై సూపర్ కింగ్స్ కు కష్టాలు వెంటాడుతున్నాయి. ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభానికి ముందే వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న జట్టులోని 14 మంది కరోనా బారిన పడ్డారు. ఆ వెంటనే సురేష్ రైనా వ్యక్తిగత కారణాలతో టోర్ని నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దుబాయ్ నుంచి ఇండియాకి తిరిగివెళ్లాడు కూడా. ఇక ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ ఫుల్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా రైనా బాటలోనే నడిచాడు. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించాడు. తన నిర్ణయాన్ని సీఎస్‌కేకు తెలియజేసినట్టు పేర్కొన్నాడు. ' ఈ ఏడాది వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ ఆడటం లేదు. ప్రస్తుత క్లిష్ట సమయంలో నేను నా కుటుంబ సభ్యులతో ఉండాల్సిన అవసరం ఉంది. సీఎస్కే మేనేజ్మెంట్ నాకు ఎంతో మద్దతుగా నిలిచింది' అంటూ హర్భజన్ ట్వీట్ చేశాడు. అటు సీఎస్కే యాజమాన్యం కూడా హర్భజన్ నిర్ణయానికి అంగీకారం తెలిపింది. అతని పరిస్థితిని అర్ధం చేసుకోగలమని వెల్లడించింది. ఇదిలాఉంటే ఐపీఎల్ 13వ సీజన్ యూఏఈలో ఈ నెల 19 నుంచి నవంబర్ 10 వరకు జరగనుంది. జట్టు సభ్యులు కరోనా బారిన పడటంతో ఇన్నాళ్లు శిక్షణ ఎస్‌కే శిక్షణ శిబిరం ఆలస్యమైంది. దీంతో శుక్రవారం తొలిసారిగా సీఎస్కే శిక్షణ శిబిరంలో ప్రాక్టీస్ ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







