పెట్రోల్ బంక్‌ల స్కాం.. ఏపీ, తెలంగాణలో చిప్‌లు ఏర్పాటు-విసి సజ్జనార్
- September 05, 2020
హైదరాబాద్:ఏపీ, తెలంగాణ పెట్రోల్ బంకుల్లో చిప్‌లు ఏర్పాటుపెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పెట్రోల్ బంకుల్లో చిప్‌లు ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.సైబరాబాద్ సీపీ సజ్జనార్ శనివారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఇంటిజిట్లర్టేడ్ చిప్‌ల ద్వారా 1000 ఎమ్ఎల్ పెట్రోల్‌లో 970 ఎమ్ఎల్ మాత్రమే వస్తుందని, వాహనాల్లో పెట్రోల్ పోసేటప్పుడు డిస్‌ప్లే వెనుక ఒక చిప్ అమర్చుతారని వెల్లడించారు. లీగల్ మెట్రాలజీ, పోలీసులు చెక్ చేసినా దొరకకుండా ఒక మదర్ బోర్డు కూడా తయారుచేశారని తెలిపారు. ఈ విధంగా హైదరాబాద్‌లోని 11 బంకుల్లో 13 చిప్పులు అమర్చారని సజ్జనార్ పేర్కొన్నారు. దీనిపై ఏపీ పోలీసులకు కూడా ఈ సమాచారం ఇచ్చామని, మొత్తం తెలంగాణలో 11, ఏపీలో 22 బంకుల్ని సీజ్ చేసినట్లు చెప్పారు.
ఏలూరుకు చెందిన శుభాని అతని గ్యాంగ్ ఈ స్కామ్కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ముంబైకి చెందిన జోసఫ్, థామస్ అనే వ్యక్తుల ద్వారా చిప్పుల్ని తయారు చేయించారని నిందితులు ఒప్పుకున్నట్లు వెల్లడించారు. ఏపీలోని పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో చిప్లు అమర్చినట్లు విచారణలో తేలిందన్నారు. షేక్ శుభాని భాష, బాజి బాబా, మాదాసు గిరి శంకర్, ఇప్పిలి మల్లేశ్వర్ రావులు ముఠాగా ఏర్పడ్డారు. ఒక సాఫ్ట్‌వేర్, ఒక ప్రోగ్రాం డిజైన్ చేశారంటే చాలా తెలివిగా ప్లాన్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటక తమిళనాడులోనూ వీళ్ళు చిప్ లు పెట్టి ఉండవచ్చు, బంకు ఓనర్లకు ఇదంతా తెలిసే జరుగుతుంది, తెలంగాణలో 4 బీపీసీఎల్, 2 హెచ్ పీసీఎల్, 5 ఐఓసీఎల్ బంకుల్లో చిప్పులు అమర్చారు ప్రస్తుతం వాటిని సీజ్ చేశాం. ఆయిల్ కార్పొరేషన్ సర్ప్రయిజ్ విజిట్ చేయటం ద్వారా ఈ మోసాన్ని కనిపెట్టలేరు. ఇక నుంచి ఆయిల్ కార్పొరేషన్ కూడా లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సజ్జనార్ వివరాలను వెల్లడించారు.



తాజా వార్తలు
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!







