ఏజెంట్‌ చేతిలో మోసపోయిన 14 మంది భారతీయ కార్మికులు

- February 09, 2016 , by Maagulf
ఏజెంట్‌ చేతిలో మోసపోయిన 14 మంది భారతీయ కార్మికులు

14 మంది భారతీయ వలస కార్మికులు ఏజెంట్‌ చేతిలో మోసపోయారు. మంచి జీతాలు, మంచి ఉద్యోగాలు అని చెప్పి బహ్రెయిన్‌కి 14 మందిని పంపించారు ఇండియాలో ఏజెంట్లు. అయితే బహ్రెయిన్‌ వచ్చాక, తాము ఆశించినదానికన్నా తక్కువ జీతాలకు పని చేయాల్సి వస్తోందని 14 మంది భారతీయ కార్మికులు వాపోతున్నారు. పైగా యజమాని తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారనీ, అదనపు సమయం పని చేయించుకుని, వేతనం చెల్లించడంలేదని ఆరోపించారు. వీరిలో ఎక్కువమంది డ్రైవర్లు మరియు మేసన్స్‌గా ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. యజమాని సరైన జీతాలు ఇస్తే తిరిగి స్వదేశానికి వెళ్ళిపోతామని బాధితులు చెప్పారు. వీరంతా ఇండియన్‌ ఎంబసీని కూడా సంప్రదించడం జరిగింది. తమకు 100 నుంచి 120 బహ్రెయినీ దినార్స్‌ వరకూ జీతాలు చెల్లిస్తారని చెప్పారనీ, ఇక్కడ 75 నుంచి 100 బహ్రెయినీ దినార్స్‌ మాత్రమే చెల్లిస్తున్నారనీ, కంపెనీ తమ పాస్‌పోర్టులను తీసేసుకుందని ఎంబసీకి ఫిర్యాదు చేసిన బాధితులు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com