'దండకారణ్యం' మార్చి నెల 4న

- February 09, 2016 , by Maagulf
'దండకారణ్యం' మార్చి నెల 4న

స్నేహ చిత్ర పిక్చర్స్‌ పతాకంపై ఆర్‌.నారాయణమూర్తి నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'దండకారణ్యం'. త్రినాథ్‌, ప్రసాద్‌రెడ్డి, విక్రమ్‌ ప్రధాన పాత్రధారులు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆర్‌.నారాయణ మూర్తి మాట్లాడుతూ, 'త్రేతాయుగంలో సీతారాములు, ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు దండకారణ్యంలోనే ఉన్నారు. అలాంటి దండకారణ్యం ఇప్పుడు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వం చేపట్టే బాక్సైట్‌ గనుల తవ్వకాల్లో అక్కడున్న ఆదివాసీలకు మనుగడ లేకుండా పోతుంది. ఆదివాసీ హక్కుల గురించి తెలియజేసే చిత్రమే 'దండకారణ్యం'.దండకారణ్యంలో పోలీసులకు, నక్సల్స్‌కి ఎప్పుడు కాల్పులు జరుగుతాయి. ప్రభుత్వం దీనిపై చర్చలు జరిపి అరణ్యంలో శాంతి చర్చలు జరపాలి. ఆదివాసీయుల సంపద వారికే చెందాలనే చెప్పేదే ఈ చిత్రం. ఇందులో వీప్లవ వీరుడు కోటన్న పాత్రలో నటించాను. ఏడు పాటలున్న ఈ చిత్రంలో మూడు పాటలను గద్దర్‌ మూడు పాడగా, మరో నాలుగు పాటలను వందేమాతరం శ్రీనివాస్‌ ఆలపించారు. గోరేటి వెంకన్న, ములుగు తిరుపతి, కాశీపతి సాహిత్యమం దించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ నెల 20న ఆడియోను విడుదల చేసి, మార్చి 4న సినిమాను రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను'అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com