ఖతర్ జాతీయ క్రీడోత్సవంలోఉత్సాహంగా పాల్గొన్న ఎమిర్

- February 09, 2016 , by Maagulf
ఖతర్ జాతీయ క్రీడోత్సవంలోఉత్సాహంగా పాల్గొన్న ఎమిర్

 ఖతర్ జాతీయ క్రీడోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్న గౌరవనీయ ఎమిర్ మంగళవారం ఉదయం సిమైస్మ లోని  సిమైస్మ యువజన కేంద్రాన్ని సందర్శించారు. ఆయన అక్కడ గుర్రపు స్వారీ, ఒంటెలపై సవారీ, తాడు లాగుడు పోటీ, సాంప్రదాయ విలువిద్య తదితర క్రీడలను అభ్యసిస్తున్న పిల్లల విన్యాసాలను ఈ సందర్భంగా వీక్షించారు. గౌరవనీయ ఎమిర్ స్వయంగా ఫుట్ బాల్ మ్యాచ్ లో పాల్గొని యువ క్రీడాకారులతో మాట్లాడతూ, కేవలం ఒక క్రీదకే పరిమితం కాక వివిధ రకాల ఆటలలో నేర్చుకోవాలని సూచించారు. ఇందుకు ప్రతిగా తమకు మద్దతు ఇచ్చిన గౌరవనీయ ఎమిర్ కు  యువ క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com