'దండకారణ్యం' మార్చి నెల 4న
- February 09, 2016
స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్.నారాయణమూర్తి నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'దండకారణ్యం'. త్రినాథ్, ప్రసాద్‌రెడ్డి, విక్రమ్ ప్రధాన పాత్రధారులు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ, 'త్రేతాయుగంలో సీతారాములు, ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు దండకారణ్యంలోనే ఉన్నారు. అలాంటి దండకారణ్యం ఇప్పుడు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వం చేపట్టే బాక్సైట్ గనుల తవ్వకాల్లో అక్కడున్న ఆదివాసీలకు మనుగడ లేకుండా పోతుంది. ఆదివాసీ హక్కుల గురించి తెలియజేసే చిత్రమే 'దండకారణ్యం'.దండకారణ్యంలో పోలీసులకు, నక్సల్స్‌కి ఎప్పుడు కాల్పులు జరుగుతాయి. ప్రభుత్వం దీనిపై చర్చలు జరిపి అరణ్యంలో శాంతి చర్చలు జరపాలి. ఆదివాసీయుల సంపద వారికే చెందాలనే చెప్పేదే ఈ చిత్రం. ఇందులో వీప్లవ వీరుడు కోటన్న పాత్రలో నటించాను. ఏడు పాటలున్న ఈ చిత్రంలో మూడు పాటలను గద్దర్ మూడు పాడగా, మరో నాలుగు పాటలను వందేమాతరం శ్రీనివాస్ ఆలపించారు. గోరేటి వెంకన్న, ములుగు తిరుపతి, కాశీపతి సాహిత్యమం దించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ నెల 20న ఆడియోను విడుదల చేసి, మార్చి 4న సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను'అని అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







