ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ భవనం శంకుస్థాపన వాయిదా...

- February 09, 2016 , by Maagulf
ఆంధ్రప్రదేశ్‌  సచివాలయ భవనం శంకుస్థాపన వాయిదా...

 ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక సచివాలయానికి ఈనెల 12న శంకుస్థాపన చేయడంలేదని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈనెల 17లోగా టెండర్లు ఖరారు చేసి వీలైనంత త్వరగా శంకుస్థాపన నిర్వహించేలా చూస్తున్నట్లు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా లాంలో వ్యవసాయ యూనివర్శిటీ ఫ్యాకల్టీ భవనానికి ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈనెల 15 తర్వాత గుంటూరు నుంచే వ్యవసాయ వర్శిటీ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 8 నెలల్లో పరిపాలన భవనం పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే బడ్జెట్‌ వర్శిటీ కోసం రూ.125కోట్లు కేటాయించేందుకు కేంద్రం హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఆచార్య ఎన్జీరంగా వర్శిటీ పాలకవర్గాన్ని త్వరలోనే ప్రకటిస్తామని... కొత్త ఉపకుపతి నియామక అంశం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com