ఒమాన్ యువత కొందరు ' ఆన్ లైన్ ' వేధింపులు

- February 10, 2016 , by Maagulf
ఒమాన్ యువత కొందరు ' ఆన్ లైన్ ' వేధింపులు

పెద్దలు పిల్లలను ' ఆన్ లైన్ ' లో  వేధించడం సైబెర్ నేరంలో పెద్ద తప్పుగా పరిగణిస్తారు. ఈ ఆరోపణలపై  తరుచు పలువురు యువకులు కోర్టుకు తీసుకురావడం ఇటీవల అధికమైందని పబ్లిక్ ప్రాసిక్యుషన్ కు  చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు. టెలికాం చట్టాలు మరియు క్రమబద్ధీకరణ ఫోరం గూర్చి పబ్లిక్ ప్రాసిక్యుషన్ జెనరల్ డాక్టర్ అల్ ముక్బలి మంగళవారం గ్రాండ్ హ్యత్ట్ మస్కట్ వద్ద మాట్లాదుతూ, ఇటీవల తమ దృష్టికి వచ్చిన ఒక బాధితురాలి అనుభవం వివరించారు. ఆమె తన 10 ఏళ్ళ కుమారుడు ఇంటేరేనేట్లో ఉంటాడని..ఆన్ లైన్ లో ఎవరో పెద్ద వ్యక్తి తరుచూ వేధిస్తున్నాడని పిర్యాదు చేసినట్లు తెలిపారు. తమ పిల్లలు కంప్యూటర్ ముందు కూర్చిని ఇంటర్నెట్ లో ఉంటాడని గర్వించక...వారి చెస్టలపై నిఘా పెట్టాలని వారి  ఆన్ లైన్ వ్యహారాలపై ఒక కన్ను వేయాలని సూచించారు. ఇటీవల కొంత మంది యువత అలుపు లేకుండా తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాలను ఆన్ లైన్ లో అన్వేషిస్తున్నారని పేర్కొన్నారు. యువతలో కొందరు అనుమానాస్పద  ఈ-మెయిల్స్ పంపుతున్నట్లు ఆ తర్వాత వారు  బ్లాక్ మెయిలింగ్ వంటి దుశ్చర్యలకు పాల్పడటం రివాజుగా మారిందని ఆయన అన్నారు. కొంతమంది పాతతరం వారికి ఇంటర్నెట్ పై సరైనా అవగాహన లేకపోవడంతో మోసకరమైన ఈ-మెయిల్స్ వలలో పడుతున్నారని తెలిపారు. అసభ్యకరమైన , హానికరమైన భావజాలం నిండిన అనేక వెబ్ సైట్ లు  ' సుల్తానేట్ ' లో నిషేధించబడినట్లు..వీటిని కటినంగా నియంత్రించనున్నట్లు ఆయన తెలిపారు. ఇవి అంతర్జాతీయ నేరగాళ్ళ నిర్వహణలోఈ అసభ్యకరమైన , హానికరమైన వెబ్ సైట్ లు నిర్వహించబడుతున్నట్లు తమ పరిశోధనలో తెలిసిందని డాక్టర్ అల్ ముక్బలి పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com