ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవనం శంకుస్థాపన వాయిదా...
- February 09, 2016
ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయానికి ఈనెల 12న శంకుస్థాపన చేయడంలేదని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈనెల 17లోగా టెండర్లు ఖరారు చేసి వీలైనంత త్వరగా శంకుస్థాపన నిర్వహించేలా చూస్తున్నట్లు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా లాంలో వ్యవసాయ యూనివర్శిటీ ఫ్యాకల్టీ భవనానికి ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈనెల 15 తర్వాత గుంటూరు నుంచే వ్యవసాయ వర్శిటీ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 8 నెలల్లో పరిపాలన భవనం పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే బడ్జెట్ వర్శిటీ కోసం రూ.125కోట్లు కేటాయించేందుకు కేంద్రం హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఆచార్య ఎన్జీరంగా వర్శిటీ పాలకవర్గాన్ని త్వరలోనే ప్రకటిస్తామని... కొత్త ఉపకుపతి నియామక అంశం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







