విమాన టికెట్ రద్దు చేసుకుంటే గరిష్టంగా వసూలు
- February 10, 2016
దేశీయ ప్రయాణానికి విమాన టికెట్ రద్దు చేసుకుంటే, వసూలు చేసే రుసుంను రూ.500 మేర పెంచుతూ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ఆదేశాలు జారీచేసింది. ఈనెల 16 నుంచి సవరించిన రుసుములు వసూలు చేస్తామని తెలిపింది. ముందుగా బుక్ చేసుకుని, ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే, గరిష్టంగా రూ.2,000 వరకు వసూలు చేస్తారు. ఇప్పటివరకు ఇది రూ.1,500గా ఉంది. ఈ వివరాలను ట్రావెల్ ఏజెంట్లకు కూడా ఎయిరిండియా తెలిపింది. కాగా, ప్రయాణం రద్దు చేసుకుంటే, వసూలు చేసే రుసుము దేశీయ సంస్థల్లో ఎయిర్ ఏషియాదే తక్కువ. ఆ సంస్థ రూ.1,502 వసూలు చేస్తోంది. స్పైస్‌జెట్ ఇటీవలే రద్దు రుసుంను రూ.1,800 నుంచి రూ.1,899కి పెంచింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







