సాఫ్ట్ వేర్ నుండి చిత్ర దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్న లేడి డైరెక్టర్ దీపిక
- September 10, 2020
హైదరాబాద్:జాంబీ వైరస్ మీద తెలుగులో మొదటగా సినిమా తీస్తున్న మహిళా దర్శకురాలు దీపిక. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే దీపిక సినిమా మేకింగ్ పట్ల ఆసక్తితో జాంబీస్ వైరస్ మీద జీ జాంబీ సినిమా చేయడం జరిగింది. ఆర్యన్ గౌర, దివ్య పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవల నిర్మాత రాజ్ కందుకూరి గారు విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ లభించింది.
ఈ సందర్భంగా దర్శకురాలు దీపిక మాట్లాడుతూ....
జీవితం అనేది ఒకటే ఉంటుంది, మనం సాధించాలి అనుకున్నది ఎంత కష్టమైన మనం దక్కించుకుని తీరాలి అది అబ్బాయి అయినా అమ్మాయి అయిన. నేను దర్శకత్వం వైపు అడుగులు వేయాలని అనుకోని సాఫ్ట్ వేర్ ఉద్యోగం మానేసి దర్శకత్వం వహించాను. జీ జాంబీ సినిమా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతొంది. మేము కష్టపడిన దానికి ప్రేక్షకులు మంచి ఫలితం ఇస్తారని భావిస్తున్నాము. ఆడియన్స్ థ్రిల్ అయ్యే ఎన్నో హారర్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. మా సినిమాకు పని చేసిన ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థియేటర్స్ లో విడుదలై మా సినిమా కచ్చితంగా మంచి పేరును తెచ్చిపెడుతోంది భావిస్తున్నానని తెలిపారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







