శ్రీవారికి కూర

శ్రీవారికి కూర

శ్రీవారికి కూర

   --డా.కోడి రామ(అల్ అయిన్,యూ.ఏ.ఈ) 

మగని ఆకలి మరచిన మగువ 
మాడ బెట్టిన కూర మసి యగును 
తగునా ఇవ్విధి కడుపు మాడ్చుట?
తరుణ లతల నమ్ముకున్న 
తలరాత లిట్లుండునని భర్తలువాపోకున్న,
పొరు గింటి పోరి తో కబుర్లేల?
పొయ్యింతి లో ఎసరు పొంగనేల?

సెల్' ఫోనులో గంటల సేపు 
సెల్ఫ్' డబ్బా కొట్టనేల  నబ్బా?
అత్తింటి కబుర్లు,ఆడబిడ్డ ఆగడాలు,
అర్థరాత్రి వరకు ఏ కరువు పెట్టనేల?

మగని మాట మరచి,నగల,చీరల గోల 
గోడవతలి గోలెమ్మతో గొంతు పోయెదా
బాతాకాని భాగోతం ఆపరాద,
"ప్రెషరు" కుక్కర్లు,"మైక్రో వేవ్" లు కొని తెచ్చిన గాని 
వారానికి ఒక్క పూటైనా నీ చేతి వంట దొరక 
కట్టుకున్నందుకు ఒక్కింత కరుణ జూపగ రా
"కర్రీ" పాయింట్ దగ్గర "క్లూ" లో నిలబెట్టి 
"బ్యూటీ పార్లర్ కి పరుగు లెడితివి గదా 
మగని ఆకలి మరచిన ఓ మగువా,
ఆవకాయున్న చాలు ఆయుష్యు కాపాడ కదరా!

 

 

 

Back to Top