కోట కు సత్కారం

- May 25, 2015 , by Maagulf
కోట కు సత్కారం

జీపీ ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే-27 బుధవారం సాయంత్రం 4గంటలకు త్యాగరాయగానసభలో ప్రముఖ నటుడు పద్మశ్రీ కోటశ్రీనివాసరావుకు సత్కారం జరగనుంది.విశ్వవిఖ్యాత నటరసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు 93వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ -జీపీఆర్ జీవితసాఫల్య పురస్కారాన్ని కోటశ్రీనివాసరావుకు ప్రదానం చేయడం జరుగుతుందని జీపీఆర్ట్స్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పి.నాగేంద్రరావు, జి.శ్రీనివాసనాయుడు పత్రికాప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు, డాక్టర్.నందమూరి లక్ష్మీపార్వతి, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, వంశీరామరాజు, ,మాశర్మ, గుండు హనుమంతరావు, జి.హనుమంతరావు, కే.మధుబాల, అంజనారెడ్డి, మహ్మద్ఫ్రీ, డాక్టర్ కళావెంకటదీక్షితులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినీసంగీత విభావరి ఉంటుందని వారు చెప్పారు.వంశీ ఆర్ట్ థియేటర్ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com