తెలంగాణా వాసికి షుమారు కోటి రూపాయల జరిమానా మాఫీ చేసిన యూఏఈ
- September 15, 2020
యూఏఈ: ఉద్యోగం కోసం పొట్ట చేత పట్టుకొని వలస వచ్చి ఏజెంట్ చేతిలో మోసపోయి ఎటు పోవాలో దిక్కుతోచక అల్లాడిపోతున్న కార్మికులు ఎందరో ఈ గల్ఫ్ లో..అటువంటి ఓ సంఘటన తాజాగా జరిగింది.
2007 లో హైదరాబాద్‌కు చెందిన లెండి పోతుగోండ మేడి విజిట్ వీసాపై యూఏఈ రావటం జరిగింది. అతన్ని తీసుకువచ్చిన ఏజెంట్ తనను వివిడిచిపెట్టి, తన వద్ద నుండి పాస్పోర్ట్ తీసేసుకొని మోసం చేసినట్టు గ్రహించాడు పోతుగోండ మేడి.దిక్కుతోచని స్థితిలో పడ్డ పోతుగొండ ఎదో చైనా చితకా పనులు చేసుకుంటే పొట్టపోసుకున్నాడు.ఇలా సంవత్సరాలు యూఏఈ లో అక్రమంగా నివిసిస్తున్నాడు.తన ఓవర్‌స్టే కి గాను దాదాపు అర మిలియన్ దిర్హామ్‌ల (షుమారు కోటి రూపాయాలు) జరిమానా బారినపడ్డాడు.
వీసా ఉల్లంఘించినవారికి ఓవర్‌స్టే జరిమానాల నుండి మినహాయింపు ఇవ్వడానికి యూఏఈ ప్రభుత్వం చేపట్టిన 'ఆమ్నెస్టీ' పధకం ద్వారా దుబాయ్‌లోని భారత కాన్సులేట్ సహాయం కోరిన తరువాత పోతుగోండ ను స్వదేశానికి పంపేందుకు మార్గం సుగమం అయింది అని ఇండియన్ కాన్సులేట్ లోని లేబర్ కాన్సులర్ జితేంద్ర నేగి మాగల్ఫ్ న్యూస్ కు చెప్పారు.
"అయితే, పోతుగోండ భారతీయ పౌరుడని నిరూపించడానికి అధికారిక పత్రం లేనందున కాన్సులేట్ వెంటనే అతనికి సహాయం చేయడం కష్టమైంది. పోతుగోండ కుటుంబాన్ని కనిపెట్టడానికి మేము హైదరాబాద్ లోని ఒక సామాజిక సహాయం అందించే ఓ సంస్థను సహాయం కోరటం జరిగింది. హైదరాబాద్ లోని టి.ఆర్ శ్రీనివాస్(సోషల్ వర్కర్ మరియు బీజేపీ జి.సి.సి,చైర్మన్) మద్దతుతో, పోతుగోండ పాత రేషన్ కార్డు మరియు ఎన్నికల ఐడి కార్డు యొక్క కాపీలను అతని స్వస్థలం నుండి పొందగలిగాము.దీంతో అతను భారతీయుడని అని నిరూపించే ఆధారాలు లభించినందున వెంటనే తన జరిమానాను మాఫీ చేసి తాను స్వస్థలానికి వెళ్లేందుకు టికెట్ కూడా అందించటం జరిగింది." అని జితేంద్ర నేగి మాగల్ఫ్ న్యూస్ కు వివరించారు.
పోతుగోండ వివరాలు అందించిన బీజేపీ జి.సి.సి,చైర్మన్ టి. ఆర్. శ్రీనివాస్ మాట్లాడుతూ "ఇక్కడ ఒక సమస్య ఎదురయింది.పోతుగోండ, నాలుగు వేర్వేరు పత్రాలకు తన పేరును నాలుగు రకాలుగా ఇచ్చాడు. దాన్ని పరిష్కరించడానికి నేను మా ఎంపి (పార్లమెంటు సభ్యుడు) ధర్మపురి అరవింద్ సహాయం తీసుకోవలసి వచ్చింది" అని ఫోన్ లో వివరించారు.
సోమవారం తన 47 వ పుట్టినరోజు జరుపుకున్నాడు అది కూడా స్వస్థలంలో ఇది తనకు నిజంగా ఒక మరిచిపోలేని 'బర్త్ డే గిఫ్ట్' అని లెండి పోతుగోండ మేడి తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







