'డి3' టైటిల్ తో క్రైం థ్రిల్లర్ సినిమా. క్లాప్ కొట్టిన నిర్మాత దిల్ రాజు
- September 15, 2020
హైదరాబాద్:నిన్ను తలచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన హీరో వంశీ యకసిరి, వరుస సినిమాలకు సైన్ చేస్తూ వెళ్తున్నాడు. వంశీ యకసిరి హీరోగా మరోసినిమా పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ముఖ్య అతిధిగా పాల్గొన్న దిల్ రాజు నటి నటులపై క్లాప్ కొట్టి చిత్ర యూనిట్ ని ఆశిర్వధించారు. ఈ సినిమాలో ధ్యానద రంత్రికర్ హీరోయిన్ కాగా భాస్కర్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైం థ్రిల్లర్ డ్రామా లో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంగీతం జయవర్ధన్ అంకె, కెమెరా రంజిత్ మొగుసాని, కొరియోగ్రాఫర్ సాయి కిరణ్. బి.యెస్ ప్రొడక్షన్ హౌస్ అండ్ ఒర్నటే పిక్చర్స్ ఏల్.ఏల్.పి బ్యానర్ల పై సంగెం బిక్షమయ్య మరియు కృష్ణ మేడ్గే లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ “ భాస్కర్ చెప్పిన సరికొత్త కథ, క్రైం థ్రిల్లర్ నాకు బాగా నచ్చి వెంటనే ఒకే చెప్పాను, ఈ సినిమా ద్వారా కూడా ప్రేక్షకులను అలరించేందుకు పూర్తిగా కృషి చేస్తాను, మా సినిమాకు పూర్తి స్థాయిలో అండగా నిలబడ్డ దిల్ రాజు గారుకి నా కృతజ్ఞతలు అని తెలిపారు. హీరోయిన్ మాట్లాడుతూ ఈ సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు విజయాన్ని అందించమని దేవుడ్ని కోరుకుంటున్నాను అని అన్నారు. దర్శకుడు భాస్కర్ రామ్ మాట్లాడుతూ మంచి కథ తో సినిమాతో సినిమా స్టార్ట్ చేశా, మంచి హిట్టు తో ప్రేక్షకుల ముందుకు వస్తా అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ మాకు అండగా నిలబడిన దిల్ రాజు గారికి, మా హీరో వంశీకి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు.
కాగా వంశీ యకసిరి నటించిన “మే 16” అనే సినిమా తెలుగు, హింది, తమిళ భాషల్లో విడుదలకు సిద్దంగా ఉంది. ఒక ప్రముఖ సంస్థ ఓటిటి లో విడుదల చేసేందుకు డీల్ చర్చలు నడుస్తున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







