ఏ.పి:అరుకులోయకు పర్యాటకులకు శుభవార్త
- September 15, 2020
ఏ.పి:అరుకులోయ ప్రియులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. విశాఖ నుంచి అరకులోయ వరకు గ్లాస్‌టాప్ కోచ్‌లను ప్రవేశపెడతామని తెలిపింది. ప్రస్తుతం ఒకటి మాత్రమే ఉన్న విస్టాడోమ్ కోచ్‌ల సంఖ్యను పెంచనున్నట్టు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డికి రైల్వే మంత్రి పియూష్ గోయల్ లేఖ రాశారు. రైల్యేశాఖ విశాఖ-అరకు రైలులో తీసుకొచ్చిన విస్టాడోమ్కు పర్యాటకుల నుంచి అభించిందని.. అయితే, విస్టాడోమ్ కోచ్ ఒక్కటే ఉండటతో రెండు నెలల ముందే రిజర్వేషన్ చేసుకోవలసిన పరిస్తితి ఏర్పడిందన విజయసాయి రెడ్డి గతంలో రైల్వేశాఖకు తెలిపారు. మరిన్న కోచ్ లు తీసుకొని వస్తే.. పర్యాటక రంగానికి బాగుంటుందని తెలిపారు. విజయసాయి చేసిన విజ్ఞప్తిపై రైల్వే మంత్రి పియూష్ గోయల్ సానుకూలంగా స్పందిస్తూ ఆయనకు లేఖ రాశారు. ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అరకు రైలుకు మరిన్ని విస్టాడోమ్ కోచ్‌లను జతచేయాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు గోయల్ తెలిపారు. ప్రస్తుతం విస్టాడోమ్ కోచ్‌లు తయారీలో ఉన్నాయని, త్వరలోనే వాటిని పర్యాటకులకు అందుబాటులోని తీసుకొని వస్తామని అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్‌లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్‌లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







