యూఏఈ కరెన్సీని అవమానించిన వ్యక్తి అరెస్ట్‌

యూఏఈ కరెన్సీని అవమానించిన వ్యక్తి అరెస్ట్‌

యూఏఈ:ఉమ్ అల్‌ కువైన్‌ పోలీస్‌, ఓ గల్ఫ్ జాతీయుడ్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. యూఏఈ నేషనల్‌ కరెన్సీని నిందితుడు అవమానిస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో సైబర్‌ క్రైమ్ సెక్షన్‌, నిందితుడి ఆచూకీ కనుగొని, అతన్ని అరెస్ట్‌ చేసింది. క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ హుమైద్‌ మట్టర్‌ మాట్లాడుతూ, నిందితుడ్ని రికార్డు సమయంలో పట్టుకోగలిగామని చెప్పారు. నిందితుడు విచారణ సందర్భంగా తన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడికి జైలు శిక్షతోపాటు, భారీ జరీమానా విధించే అవకాశం వుంది.

 

Back to Top