'అహం' లో విలన్‌గా రాజశేఖర్
- February 10, 2016
'యాంగ్రీ యంగ్‌మ్యాన్' పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో రాజశేఖర్ ఇప్పుడు పూర్తిస్థాయి విలన్‌గా కనిపించను న్నారు. ఇందుకు రంగం సిద్ధమవుతోంది. 'నువ్వు-నేను', 'జయం' లాంటి బ్లాక్బస్టర్లు తీసిన తేజ దర్శకత్వంలో త్వరలో 'అహం' పేరుతో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో విలన్‌గా రాజశేఖర్ నటించనున్నారు. తేజ చెప్పిన స్క్రిప్ట్‌కు ఇంప్రెసైన రాజశేఖర్ వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇందులో ఓ యంగ్ హీరో చేయనున్నారు. రాజశేఖర్‌కు జోడీగా ప్రముఖ కథానాయికను ఎంపిక చేయనున్నారు.ఇటీవలి కాలంలో హీరో జగపతిబాబు కూడా విలన్‌గా మారి, వరుస విజయాలు అందుకుంటున్న నేపథ్యంలో రాజశేఖర్ విలన్‌గా ఎంట్రీ ఇవ్వడంపై తెలుగు సినీ సీమలో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది.రాజశేఖర్ తన కెరీర్ తొలినాళ్ళలో 'తలంబ్రాలు' చిత్రంలో నెగిటివ్ రోల్ చేశారు. 'అహం'లో రాజశేఖర్ పాత్రను విభిన్నంగా ఆవిష్కరించడానికి తేజ సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి అధికారిక సమాచారం త్వరలోనే తెలియనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







