కువైట్:ఇక నుంచి డిజిట్ సివిల్ ఐడీలతో విమాన ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్

- September 18, 2020 , by Maagulf
కువైట్:ఇక నుంచి డిజిట్ సివిల్ ఐడీలతో విమాన ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్

కువైట్ సిటీ:కువైట్ నుంచి వెళ్లాలన్నా..కువైట్ రావాలన్నా..సరైన డాక్యుమెంట్లు లేక ఇబ్బంది పడుతున్న వారికి గుడ్ న్యూస్ అందించింది కువైట్ ప్రభుత్వం. ఇక నుంచి డిజిటల్ సివిల్ ఐడీలను కూడా ట్రావెల్ డాక్యుమెంట్లుగా ఆమోదించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కువైట్ లోని అన్ని పోర్టులు, విమానాశ్రయాలకు అలాగే కువైట్ కు సర్వీసులు నడిపే ఎయిర్ లైన్స్ కు సమాచారం అందించింది. లాక్ డౌన్ తర్వాత చాలా మంది ప్రవాసీయులు సరైన డాక్యుమెంట్లు లేక విమాన ప్రయాణ అనుమతికి ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా దేశాల ఎంబసీల నుంచి ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు తీసుకొని ప్రయాణం చేయవచ్చని వెసులు బాటు కలిపించిన కువైట్ ప్రభుత్వం..తాజాగా విదేశీ ప్రయాణాలకు సంబంధించి నిబంధనలను మరింత సులభతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. కువైట్ అధికారిక మొబైల్ యాప్ లోని సివిల్ ఐడీని చూపించి విదేశీ ప్రయాణం చేయొచ్చని స్పష్టం చేసింది. అలాగే ఇతర దేశాల నుంచి కువైట్ కు రావొచ్చని కూడా క్లారిటీ ఇచ్చింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు కువైట్ లో ఉన్న అన్ని దేశాల రాయబార కార్యాలయాలకు సమాచారం అందించారు. అలాగే విదేశాల్లో ఉన్న కువైట్ రాయబార కార్యాలయాలకు కూడా సివిల్ ఐడీలను ట్రావెల్ డాక్యుమెంట్లుగా అనుమతించాలని ఆదేశించింది. కువైట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రవాసీయుల ప్రయాణం మరింత సులభం కానుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com