ఢిల్లీ విమానాశ్రయంలో ప్రైవేట్ జెట్లకు ప్రత్యేక టెర్మినల్ ప్రారంభించిన కేంద్ర మంత్రి

- September 17, 2020 , by Maagulf
ఢిల్లీ విమానాశ్రయంలో ప్రైవేట్ జెట్లకు ప్రత్యేక టెర్మినల్ ప్రారంభించిన కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: భారత దేశంలోనే తొలిసారి ప్రైవేట్ జెట్ విమానాల కోసం ఢిల్లీ విమానాశ్రయంలో ప్రత్యేకంగా నిర్మించిన టెర్మినల్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గురువారం ప్రారంభించారు. ప్రత్యేకమైన ఈ టెర్మినల్ ద్వారా ప్రైవేట్ జెట్ల విమాన కార్యకలాపాలను నిర్వహిస్తారు. చార్టెడ్ విమానాల్లో ప్రయాణించే వారు ఇకపై ఈ టెర్మినల్ సేవలు వినియోగించుకోవచ్చు. ఇందులో ప్రైవేట్ విమానాల కోసం 57 పార్కింగ్ బేలు ఉన్నాయి. రోజులో సుమారు 150 చార్టెడ్ విమానాలు ఇక్కడి నుంచి ప్రయాణించే అవకాశమున్నది.

కరోనాకు ముందు ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రతి రోజు 40 ప్రైవేట్ జెట్ విమానాలు ప్రయాణించగా ప్రస్తుతం ఈ సంఖ్య 20గా ఉన్నదని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఈ ప్రత్యేక టెర్మినల్ కాస్త చిన్నగా ఉన్నప్పటికీ దీని ప్రాముఖ్యాన్ని పెంచుతుందని ఆయన చెప్పారు. టెర్మినల్ ద్వారా ప్రతి గంటకు 50 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చని GMR గ్రూప్ నేతృత్వంలోని డీఐఎల్ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com