తెలంగాణలో కొత్తగా 2,043 కరోనా పాజిటివ్ కేసులు
- September 18, 2020
హైదరాబాద్:తెలంగాణలో నిన్న రాత్రి 8 గంటల వరకు 50 వేల 634 పరీక్షలు నిర్వహించగా... 2 వేల 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు ఉన్న కేసుల సంఖ్య ఒక లక్షా 67 వేల 46కి చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్క రోజులో కరోనా 11 మంది చనిపోగా... రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాలు... ఒక వెయ్యి 16కి చేరాయి. కరోనా నుంచి నిన్న ఒక్క రోజులో 18 వందల 2 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య ఒక లక్షా 35 వేల 357కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30 వేల 673 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 24 వేల 81 మంది హోం ఐలోలేషన్లో ఉన్నారని హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 23 లక్షల 79 వేల 950 కరోనా శాంపిల్స్ పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా GHMC పరిధిలో 314, రంగారెడ్డిలో 174, మేడ్చల్లో 144 కొత్త కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







