కోవిడ్ వ్యాప్తి నియంత్రణపై మరింత ఫోకస్ చేస్తున్న దుబాయ్..
- September 18, 2020
దుబాయ్:కోవిడ్ 19ను సమర్ధవంతంగా అరికట్టేందుకు అన్ని విధాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు దుబాయ్ అధికారులు. దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను అమలు చేస్తున్న నేపథ్యంలో మాల్స్ ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆరోగ్య శాఖ సూచనల మేరకు మాల్స్, వాణిజ్య కేంద్రాలు కోవిడ్ నియంత్రణకు ముందస్తు జాగ్రత్త చర్యలు పాటిస్తున్నాయా? లేదా? అనేది ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా దుబాయ్ లోని పలు మాల్స్, రిటైల్ షాపులలో తనిఖీలు చేపట్టిన అధికారులు..కోవిడ్ నిబంధనలు పాటించని 7 షాపుల నిర్వాహకులకు ఫైన్ విధించారు. మాస్కులు, గ్లౌజులు ధరించకుండా షాపులు నిర్వహిస్తున్న కారణంగా జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. అలాగే రెండు షాపుల్లో భౌతిక దూరం అమలు నిబంధనను ఉల్లంఘించినట్లు గుర్తించామని..ఆ షాపుల నిర్వాహకులను హెచ్చరించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







