UAE లో హైదరాబాద్ సన్‌ 'రైస్' అవుతుందా ? ఆశలు అన్ని వార్నర్ పైనే

- September 19, 2020 , by Maagulf
UAE లో హైదరాబాద్ సన్‌ \'రైస్\' అవుతుందా ? ఆశలు అన్ని వార్నర్ పైనే

UAE లో జరుగుతున్న ఐపీఎల్‌ పోరులొ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరొ సారి చాంపియన్‌గా నిలవాలని గట్టి పట్టుదలగా వుంది.డేవిడ్‌ వార్నర్ నాయకత్వం లొని జట్టు అన్ని విభాగాలలో పటిష్టంగా కనపడుతుంది.

డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో అద్భుత ఆరంభంకు, కేన్‌ విలియమ్సన్‌ , మనీష్‌ పాండే ఇన్నింగ్స్ జత కలిస్తే భారీ ఇన్నింగ్స్ కు పునాది పడ్డట్లే .బౌలింగ్‌ విభాగానికొస్తే పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌ భువనేశ్వర్‌ కుమార్‌, మేటి స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌తో తిరుగులేకుండా ఉంది, వారికి ఖలీల్‌ అహ్మద్‌, సిద్దార్థ్‌ కౌల్‌, బిల్లీ స్టాన్‌లేక్‌ మద్దతిస్తే తక్కువ స్కోర్ మ్యాచెస్ కూడ గెలుపు దిశ గా మార్చ గల సత్తా సన్‌రైజర్స్ కు వుంది.ఈసారి మిడిలార్డర్‌ లొ విరాట్‌ సింగ్‌, ప్రియం గార్గ్‌, జమ్మూ కశ్మీర్‌కు చెందిన అబ్దుల్‌ సమద్‌ వంటి యువ క్రికెటర్లు సత్తా చాటుకోవల్సి వుంది, వీరికి నేషనల్ జట్టు సెలెక్టర్ల దృష్టిలో పడడానికి కూడ ఇది మంచి అవకాశం. పోయినేడాది ఐపీఎల్‌ లొ వార్నర్‌ చివరి మ్యాచెస్ ఆడలేకపొడం దాని ప్రభావం జట్టు మీద పడటం చూశాము కాని ఈసారి డేవిడ్‌ వార్నర్‌ అన్ని మ్యాచెస్ ఆడనుండటం కూడ సన్‌రైజర్స్ అదనపు బలం అనే చెప్పాలి.

బలం:
 ఓపెనింగ్‌ జోడీ వార్నర్‌, బెయిర్‌ స్టో సన్‌రైజర్స్‌కు బలం,బౌలింగ్‌ విభాగానికొస్తే పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌ భువనేశ్వర్‌ కుమార్‌, మేటి స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌.

బలహీనత:  
మిడిలార్డర్‌లో అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్‌ లేకపోవడం జట్టుకు మైనస్‌.

--పవన్ బసిరెడ్డి(మాగల్ఫ్ ప్రతినిధి,హైదరాబాద్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com