దుబాయ్‌లో 5 కొత్త పార్కులు

- February 10, 2016 , by Maagulf
దుబాయ్‌లో 5 కొత్త పార్కులు

దుబాయ్‌ మునిసిపాలిటీ ఐదు కొత్త పార్కులకు ఆమోదం తెలిపింది. మొత్తం ఐదు పార్కుల్ని నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనీ, వీటి కోసం 37 మిలియన్‌ దిర్హామ్‌లు ఖర్చు చేయాలని భావిస్తున్నారు. రెసిడెన్షియల్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ఈ ప్రాంతాల్లో 20 శాతం భాగం డిజేబుల్డ్‌ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దనున్నారు. 2017 జనవరి నాటికి పార్క్‌ల నిర్మాణం పూర్తవుతుంది. అల్‌ వర్కా, అల్‌ తవార్‌, అల్‌ మంఖౌల్‌, ముహాసినా తదితర ప్రాంతాల్లోని పార్కుల్ని డిజేబుల్డ్‌ ఫ్రెండ్లీగా మలచనున్నారు. ఈ పార్కుల్లో విజువల్‌ డిజేబుల్డ్‌ పర్కాటకులకు సహాయ సహకారాలు అందించేందుకు శిక్షణ ఇచ్చిన సిబ్బందిని వినియోగిస్తారు. బ్రెయిలీ లాంగ్వేజ్‌లో బోర్డులు, అలాగే ఆడియో టేప్‌ మరియు అలారమ్‌ సిస్టమ్‌ అందుబాటులోకి తెస్తారు. కార్‌ పార్కింగ్‌ స్లాట్లు, ప్రత్యేకమైన పాత్‌లు, ఎలక్ట్రానిక్‌ గేట్స్‌ ప్రవేశం కోసం వినియోగిస్తారు. వీల్‌ఛైర్‌లో వచ్చేవారికోసం తక్కువ ఎత్తుతో కూడిన కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com