చెత్త బాల్కనీలు: 300 షార్జా నివాసితులకు జరీమానా
- February 10, 2016
షార్జా మునిసిపాలిటీ 300 రెసిడెంట్స్‌కి ఈ సంవత్సరం జరీమానా విధించింది. బాల్కనీల్లో బట్టలను ఆరవేయడం, డిష్ యాంటెనాలను అమర్చడం, వాడకంలో లేని సామాన్లను భద్రపరచడం వంటి అభియోగాలపై వీరికి జరీమానా విధించడం జరిగింది. 9400 జరీమానాలు 'నగరం అందాల్ని పాడు చేయడం' అనే చర్యలకు విధించినట్లు అధికారులు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించినవారికి 500 దిర్హామ్‌లు జరీమానాను విధిస్తున్నారు. నగరం యొక్క అందాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి విధి అనీ, నగర అందాల్ని చెడగొట్టే విధంగా ఎవరు ప్రయత్నించినా శిక్షార్హులు అవుతారని అధికారులు తెలియజేశారు. బాల్కనీల్లో బట్టలు ఆరవేసుకోవడం నేరం కాకపోయినప్పటికీ, అవి బయటకు కనిపించేలా చేయరాదని వారు చెప్పారు. అలాగే వాడకంలో లేని వస్తువులు పిల్లల పాలిట ప్రమాదకరంగా మారుతున్నాయని, ఈ కారణంగా పసిపిల్లల మరణాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. అందమైన నగరాన్ని పరిరక్షించేందుకుగాను ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు అధికారులు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







