దుబాయ్‌లో 5 కొత్త పార్కులు
- February 10, 2016
దుబాయ్ మునిసిపాలిటీ ఐదు కొత్త పార్కులకు ఆమోదం తెలిపింది. మొత్తం ఐదు పార్కుల్ని నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనీ, వీటి కోసం 37 మిలియన్ దిర్హామ్‌లు ఖర్చు చేయాలని భావిస్తున్నారు. రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ఈ ప్రాంతాల్లో 20 శాతం భాగం డిజేబుల్డ్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దనున్నారు. 2017 జనవరి నాటికి పార్క్‌ల నిర్మాణం పూర్తవుతుంది. అల్ వర్కా, అల్ తవార్, అల్ మంఖౌల్, ముహాసినా తదితర ప్రాంతాల్లోని పార్కుల్ని డిజేబుల్డ్ ఫ్రెండ్లీగా మలచనున్నారు. ఈ పార్కుల్లో విజువల్ డిజేబుల్డ్ పర్కాటకులకు సహాయ సహకారాలు అందించేందుకు శిక్షణ ఇచ్చిన సిబ్బందిని వినియోగిస్తారు. బ్రెయిలీ లాంగ్వేజ్‌లో బోర్డులు, అలాగే ఆడియో టేప్ మరియు అలారమ్ సిస్టమ్ అందుబాటులోకి తెస్తారు. కార్ పార్కింగ్ స్లాట్లు, ప్రత్యేకమైన పాత్‌లు, ఎలక్ట్రానిక్ గేట్స్ ప్రవేశం కోసం వినియోగిస్తారు. వీల్‌ఛైర్‌లో వచ్చేవారికోసం తక్కువ ఎత్తుతో కూడిన కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







