మస్కట్‌ ఎయిర్‌పోర్ట్‌ పార్కింగ్‌ ఏరియా పెంపు

- February 10, 2016 , by Maagulf
మస్కట్‌ ఎయిర్‌పోర్ట్‌ పార్కింగ్‌ ఏరియా పెంపు

మస్కట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో పార్కింగ్‌ ఏరియాను పెంచారు. ఫిబ్రవరి 15న ఈ కొత్త పార్కింగ్‌ ఏరియాను ప్రారంభించనున్నట్లు ఒమన్‌ ఎయిర్‌పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఓఎఎంసి) వెల్లడించింది. ప్రస్తుతం వున్న చెల్లింపు విధానాన్ని కూడా మెరుగు పరిచారు. తొలి 24 గంటలకు గాను పార్కింగ్‌ రుసుము 3 ఒమన్‌ రియాల్స్‌గా నిర్ణయించారు. రెండో రోజుకి 4 ఒమన్‌ రియాల్స్‌, మూడో రోజుకి 5 ఒమన్‌ రియాల్స్‌, 4వ రోజుకి 6 ఒమన్‌ రియాల్స్‌ వసూలు చేస్తారు. ఫిబ్రవరి నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. 5వ రోజు తర్వాత ప్రతిరోజుకీ 7 ఒమన్‌ రియాల్స్‌ వసూలు చేయడం జరుగుతుంది. మస్కట్‌ ఇంటర్నేషనల్‌ విమానాశ్రయ వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఒమన్‌ ఎయిర్‌పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతానికి 670 కొత్త లాంగ్‌ టర్మ్‌ పార్కింగ్‌ స్పేస్‌లను అందుబాటులోకి తెచ్చామనీ, ముందు ముందు ఈ సంఖ్య ఇంకా పెంచుతామని అధికారులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com