చెత్త బాల్కనీలు: 300 షార్జా నివాసితులకు జరీమానా

- February 10, 2016 , by Maagulf
చెత్త బాల్కనీలు: 300 షార్జా నివాసితులకు జరీమానా


షార్జా మునిసిపాలిటీ 300 రెసిడెంట్స్‌కి ఈ సంవత్సరం జరీమానా విధించింది. బాల్కనీల్లో బట్టలను ఆరవేయడం, డిష్‌ యాంటెనాలను అమర్చడం, వాడకంలో లేని సామాన్లను భద్రపరచడం వంటి అభియోగాలపై వీరికి జరీమానా విధించడం జరిగింది. 9400 జరీమానాలు 'నగరం అందాల్ని పాడు చేయడం' అనే చర్యలకు విధించినట్లు అధికారులు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించినవారికి 500 దిర్హామ్‌లు జరీమానాను విధిస్తున్నారు. నగరం యొక్క అందాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి విధి అనీ, నగర అందాల్ని చెడగొట్టే విధంగా ఎవరు ప్రయత్నించినా శిక్షార్హులు అవుతారని అధికారులు తెలియజేశారు. బాల్కనీల్లో బట్టలు ఆరవేసుకోవడం నేరం కాకపోయినప్పటికీ, అవి బయటకు కనిపించేలా చేయరాదని వారు చెప్పారు. అలాగే వాడకంలో లేని వస్తువులు పిల్లల పాలిట ప్రమాదకరంగా మారుతున్నాయని, ఈ కారణంగా పసిపిల్లల మరణాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. అందమైన నగరాన్ని పరిరక్షించేందుకుగాను ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు అధికారులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com