సౌదీ: జాతీయ పతాకాన్ని కించపరిచేలా వ్యవహరిస్తే జైలు శిక్ష, జరిమానా
- September 22, 2020
సౌదీ: 90 జాతీయ దినోత్సవానికి వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సౌదీ అరేబియా..జాతీయ పతాకం విషయంలోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. జాతీయ దినోత్సం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణలో ఎవరూ పొరపాట్లు చేయకుండా అలాగే పతాకాన్ని అవమానించకుండా సౌదీ ప్రాసిక్యూషన్ అథారిటీ ముందస్తు సూచనలు చేసింది. జాతీయ పతాకం ఆకు పచ్చరంగులో ఉండి తెలుపు ఏకధర్మవాద సూక్తి ఉంటుందని, దాని కింద తెలుపు రంగులో ఉండే కత్తి ఉంటుందని పతాక విశిష్టతను వివరించింది. అందుకే జెండాను సగం ఎత్తులో ఎగరేయకూడదని హెచ్చరించింది. ఇక జాతీయ పతాకాన్ని కింద పడేసినా, నాశనం చేసినా, కించపరిచేలా వ్యవహరించినా తీవ్ర నేరంగా పరిగణించబడుతుంది. అలాగే రాయల్ ఫ్లాగ్ తో పాటు సౌదీ జాతీయ జిహ్నం విషయంలోనూ ఇవే నిబంధనలు వర్తిస్తాయి. జాతీయ పతాకాన్ని అవమానిస్తే..నిందితుడికి ఏడాది జైలు శిక్ష, 3,000 రియాల్స్ ఫైన్ విధిస్తారు. కొన్నిసార్లు జైలు శిక్ష, జరిమానా రెండూ విధిస్తారు. అంతేకాదు సౌదీకి స్నేహపూర్వకంగా ఉండే దేశాల జాతీయ పతాకాలను అవమానించినా శిక్ష తప్పదని ప్రాసిక్యూషన్ అథారిటీ హెచ్చరించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







