హ‌‌స్తిన‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపి సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి భేటీ

- September 22, 2020 , by Maagulf
హ‌‌స్తిన‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపి సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి భేటీ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను ఢిల్లీలో మంగళవారం సాయంత్రం కలిశారు. రాష్ట్రాభివృద్ధి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. సీఎం జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, బాలశౌరి ఉన్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఈ రోజు  రాత్రి సీఎం జగన్‌ ఢిల్లీలోనే బస చేస్తారు. బుధవారం ఉదయం బయల్దేరి నేరుగా తిరుపతి చేరుకుంటారు. అక్కడతిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి తిరుమలలోనే బస చేసి గురువారం కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి కర్ణాటక ప్రభుత్వం తిరుమలలో నిర్మించనున్న భవనానికి జరిగే భూమి పూజలో పాల్గొంటారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి అజెండాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సాగుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com