నాన్నకి తెలియకుండానే సత్యానంద్ వద్ద నటశిక్షణ తీసుకున్నా-హీరో కృష్ణంరాజు
- September 23, 2020
హైదరాబాద్:నాకు మెగాస్టార్ అంటే చిన్నప్పటి నుంచి భక్తి. ఆయన స్ఫూర్తితోనే నేను నటనలోకి వచ్చా. ఇంజనీరింగ్ అర్హతతో జాబ్ చేసాక కొన్నాళ్లకు నటశిక్షణ పొంది ఆఫర్ అందుకున్నా`` అని తెలిపారు హాస్య నటుడు గౌతం రాజు కుమారుడు కృష్ణంరాజు. సెప్టెంబర్ 24న తన పుట్టినరోజు సందర్భంగా ఈ యువహీరో కెరీర్ ముచ్చట ఇదీ..
తొలి ప్రయత్నం ‘కృష్ణారావు సూపర్ మార్కెట్’ చాలా మంచి అనుభూతిని ఇచ్చింది. నటుడిగా ఎంతో నేర్చుకున్నాను. ఏం చేయకూడదో, ఏం చేయాలో అనే విషయాలపై అవగాహన వచ్చింది. దర్శకుడు శ్రీనాథ్ పులకురం నాన్నగారిని కలిసి కథ వినిపించారు. తనికెళ్ల భరణి కి కూడా చెప్పారు. ఆయన చాలా బాగుందనడంతో నాన్నగారు, ఆయన స్నేహితులు ముందుకొచ్చి ఆ సినిమా చేశారు.
నాకు మాస్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవిని చూసే పెరిగాను. ఆయన నుంచి ఎప్పుడూ ఎక్కువగా ఇన్స్‌పైర్ అయ్యేది ఫైట్స్, డ్యాన్స్ విషయంలోనే. నేను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్‌కు కానీ, జిమ్నాస్టిక్స్‌కు కానీ ఈ కథ సూట్ అవుతుందనిపించి చేశాను. ``అయితే ఈ మూవీని నా అభిమాన హీరో చిరంజీవి ఇంకా చూడలేదు. అక్కడిదాకా ఇంకా రీచ్ అవలేదని బాధ పడుతున్నా. ఏదో ఒక రోజు నేను ఆయన ఆశీస్సులు అందుకోవాలి. ఆయన చేతుల మీదుగా ఏదో ఒక చిన్న అవార్డు అయినా తీసుకోవాలనే కోరిక. అది నా బిగ్గెస్ట్ డ్రీమ్. అందుకోసం ఎంతైనా కష్టపడతా`` అని అన్నారు. సినిమాలు వదిలేస్తే నాన్నగారి సేవాకార్యక్రమాల్లో నేను సాయపడుతుంటాను. సాటివారికి అన్నం పెట్టాలని ఆపదలో ఆదుకోవాలనుకునే నాన్నగారు నాకు స్ఫూర్తి. రాళ్లపల్లి గారి నుంచి నాన్నగారికి ఆ అలవాటు వచ్చింది. తనికెళ్ల భరణి గారు, బ్రహ్మానందం గారు, ‘మా’ అధ్యక్షులు నరేష్ .. వీరంతా ఒక టీమ్‌గా చాలామందికి సాయం చేస్తుంటారు. నేను ఎన్నోసార్లు చూశా అని తెలిపారు.
నాన్నకి తెలియకుండానే సత్యానంద్ వద్ద నటశిక్షణ తీసుకున్నా. ఆ తర్వాత ఆడిషన్స్ లో సెలక్టయ్యాను అలాగే దర్శకుల్లో సుకుమార్ అంటే చాలా ఇష్టం. తర్వాత కృష్ణవంశీ , పూరీ జగన్నాథ్, రాజమౌళి.. హరీష్ శంకర్ అంటే చాలా ఇష్టం అని తెలిపారు.
తాజా వార్తలు
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు







