కోవిడ్ నిబంధనలు పాటించకుండా పార్టీ నిర్వహించిన మహిళకు Dh 10,000 ఫైన్

- September 24, 2020 , by Maagulf
కోవిడ్ నిబంధనలు పాటించకుండా పార్టీ నిర్వహించిన మహిళకు Dh 10,000 ఫైన్

దుబాయ్:కరోనా వ్యాప్తి నియంత్రణకు వివాహం, అంత్యక్రియలపై కూడా నిబంధనలు అమలు చేస్తుంటే కొందరు పేజ్ త్రీ వ్యక్తులు మాత్రం ఇవేమి చెవికెక్కించుకోవటం లేదు. పార్టీల పేరుతో నిబంధనలను గాలికి వదిలిస్తున్నారు. దుబాయ్ లో ఓ మహిళ కోవిడ్ నియంత్రణ నిబంధనలను పాటించకుండా పార్టీ చేసింది. ఈ పార్టీకి పలువురు మీడియా వ్యక్తులు, అరబ్ సెలబ్రెటీలు కూడా హజరయ్యారు. అయితే..పార్టీకి సంబంధించిన వీడియో వైరల్ కావటంతో...పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. వీడియోలోని విజువల్స్ లో పార్టీకి హజరైన అతిథులు ఎవరూ కోవిడ్ నిబంధనలు పాటించలేదని స్పష్టంగా అర్ధమవుతోంది. చాలామంది మాస్కులు ధరించలేదు. భౌతిక దూరం పాటించలేదని నిర్ధారించుకున్న పోలీసులు...పార్టీ ఏర్పాటు చేసిన సదరు మహిళకు సమన్లు జారీ చేశారు. ఆ తర్వాత ఆమెకు Dh10,000 జరిమానా విధించారు. అంతేకాదు..పార్టీకి హజరైన వారికి కూడా ఒక్కొక్కరికి Dh 5,000 జరిమానా విధిస్తామని దుబాయ్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ వారంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం ఇది రెండోసారి. కోవిడ్ నిబంధనలను పాటించకుండా ఇటీవలె పార్టీ నిర్వహించిన మరో మహిళకు కూడా Dh10,000 జరిమానా విధించారు దుబాయ్ పోలీసులు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com