ఉపాసన కోసం చెఫ్ గా మారిన సమంత

- September 27, 2020 , by Maagulf

హైదరాబాద్:లక్ష్యంతో హీరో రామ్ చరణ్ సతీమణి,అపోలో సంస్థ వైస్ చైర్మన్ ఉపాసన కొణిదెల"యుఆర్ లైఫ్" అనే వెబ్ సైట్ ను నిర్వహిస్తున్నారు. URLife.co.in వెబ్
సైట్ ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం, ముఖ్యంగా - ప్రకృతి అనుకూలమైన జీవనం,
సంపూర్ణ ఆరోగ్యం వంటి కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలను ప్రజలకు చేరువ
చేయడమే.

ఈ వెబ్ సైట్ కు అతిథి సంపాదకురాలిగా స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని
పేరుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా  సమంత , ఉపాసన తో
కలిసి "తక్కలి సదం" వంటకాన్ని చేసి చూపించారు. ఆ వంటకం రెసిపీ వీడియో లో
చూపించారు.వాళ్లిద్దరూ ఎంజాయ్ చేస్తూ కుకింగ్ లో పాల్గొన్నారు.
సమంత కూడా ఈ మధ్య "అర్బన్ ఫామింగ్" పేరు తో ఆరోగ్యం మీద ,తినే ఆహారం మీద
చాలా శ్రద్ద తీసుకుంటూ అందరికీ స్ఫూర్తి గా నిలుస్తున్నారు. వీళ్ళిద్దరూ
కలిసి అందరికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం చూడ ముచ్చటగా
ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com