అధికంగా షాంపూలను వాడేస్తే.. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ !
- February 11, 2016
షాంపూలు, బాడీలోషన్స్, సన్ స్ర్కీన్ లోషన్స్, క్రీములు.. అన్నింటిలోనూ కెమికల్స్ ఉంటాయని అందరికీ తెలుసు. కానీ.. కొంతమంది మోతాదుకి మించి వాడేస్తుంటారు. ఎడాపెడా షాంపూలను వాడేస్తే.. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తప్పదని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.సూపర్ ఫుడ్స్ : క్యాన్సర్ తో పోరాడుతాయి మరియు నివారిస్తాయి మంచి సువాసనలు వెదజల్లే వీటికి అలవాటు పడనివారంటూ ఉండరు. ఈ ఉత్పత్తులలో వాడే కెమికల్స్ లో పారాబెన్స్ అని పిలిచే ఈస్ర్టోజెన్ మిమిక్కింగ్ అనే కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఈస్ర్టోజన్స్ ప్రభావంతో వ్యాధులు సోకడానికి కారణమవుతాయని అధ్యయనాలు వివరిస్తున్నాయి. ఈ కెమికల్స్ ని ఈస్ర్టోజెనిక్ గా గుర్తించారు. ఇవి ఉత్తేజపరిచే ఈస్ర్టోజెన్ రిసెప్టర్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ని పెంచుతాయి. అలాగే రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ని కూడా తీసుకొస్తాయి.ఈ పారాబెన్స్ వృద్ధి చెందడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ కణాలపై ఈస్ర్టోజెన్స్ హాని చేస్తాయి. షాంపూలలో ఉండే కెమికల్స్ మానవ కణాలపై దుష్ర్పభావం చూపడమే కాదు.. ఇవి అణువులకు సంకేతాలు పంపి రొమ్ము క్యాన్సర్ రిస్క్ ని పెంచుతాయి. బ్రెస్ క్యాన్సర్ కణాలు ఈస్ర్టోజెన్ రిసెప్టర్స్, హ్యుమన్ ఎడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ ఉంటాయి.25 శాతం బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ హ్యుమన్ ఎడెర్మల్ గ్రోత్ ని ఉత్పత్తి చేస్తాయి. ఈ హెచ్ఈఆర్ పాజిటివ్ ట్యూమర్స్ చాలా ఫాస్ట్ గా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెంచడానికి సహాయపడతాయి. కాబట్టి తక్కువ గాఢత ఉన్న షాంపూలను ఉపయోగించాలి. లేదా న్యాచురల్ పద్ధతిలో షీకాయ వంటి వాటిని ఉపయోగించడం మంచిది. షాంపూలు ఉపయోగించాలి అనుకునేవాళ్లు.. తక్కువ మోతాదులో వాడటం మంచిది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









