స్పైసీ అండ్‌ క్రిస్పీ ఎగ్‌ చిల్లీ

- February 11, 2016 , by Maagulf
స్పైసీ అండ్‌ క్రిస్పీ ఎగ్‌ చిల్లీ

కావలసిన పదార్ధాలు: ఉడికించిన కోడిగుడ్లు- 4, పచ్చిమిర్చి పేస్ట్‌- 1 టీస్పూన, పండుమిర్చి పేస్ట్‌- 1 టీస్పూన, ఉల్లిపాయ తరుగు- 2 టేబుల్‌ స్పూన్లు, అల్లం, వెల్లుల్లి తరుగు- కొంచెం, చింతపండు గుజ్జు- 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, సోయాసాస్‌- 1 టీస్పూన, నూనె- వేయించడానికి సరిపడా 

తయారీ విధానం: ముందుగా పానలో నూనె పోసి వేడయ్యాక గుడ్లను మెల్లగా వేసి పైనంతా గోధుమరంగు వచ్చేవరకు వేయించి, తీసి పక్కన పెట్టాలి. తర్వాత విడిగా మరో పానలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అల్లం, వెల్లుల్లి తరుగు వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు అందులో పండుమిర్చి పేస్ట్‌, పచ్చిమిర్చి పేస్ట్‌ వేసి నిమిషంపాటు వేయించాలి. దానికి సోయాసాస్‌, చింతపండు గుజ్జు, ఉప్పువేసి ఉడికించి స్టౌ కట్టేయాలి. తరువాత ఆ మిశ్రమంలో వేయించిన గుడ్లకు సాస్‌ పూసి వేయాలి. చైనీస్‌ రైస్‌, రోటీ లేదా పరోటాలోకి ఈ చిల్లీ ఎగ్‌ కాంబినేషన రుచిగా ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com