గానగంధర్వునికి యూఏఈ గాయకుల నివాళి
- September 30, 2020
మాగల్ఫ్ స్పెషల్: 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మ పేట గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు రెండో సంతానంగా జన్మించిన ఆణిముత్యం మన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం..అందరు అప్యాయంగా పిలిచే ఎస్పీ బాలు..శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న(1966) చిత్రంతో మొదలైన బాలు సినీప్రస్థానం ప్రపంచ గుర్తింపు సాధించింది. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలోనూ ఆయన పాడిన పాటకు ఎన్నో జాతీయ పురస్కారాలు లభించాయి. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రస్థానంలో నలభై వేల పైచిలుకు పాటలు పాడి గిన్నిస్ రికార్డును సాధించారు.
భాష ఏదైనా తన గాన మాధుర్యంతో చిన్నాపెద్దా వయస్కుల మనసులను కట్టిపడేసిన ఆ కంఠం మూగబోయిందనే వార్త యావత్ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. 'సుప్రభాతం' తో మొదలై 'హరివరాసనం' వరకు ఇలా దైనిక జీవితంలో మమేకమైపోయిన ఆ గానగంధర్వుడు ఇక లేరు అంటే మనసు అంగీకరించట్లేదనేది కఠిన వాస్తవం.
ఆ మధుర గాయకునితో తమకున్న అనుబంధాన్ని, ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ యూఏఈ లోని గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కు అందిస్తున్న నివాళి.
(as per alphabetical order)














--- సౌమ్య , స్పెషల్ కరెస్పాండంట్, మాగల్ఫ్
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







