'షాదీ ముబారక్' ఫస్ట్ లుక్ విడుదల
- September 30, 2020
హైదరాబాద్:సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు, శిరీష్ నిర్మాతలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'షాదీ ముబారక్'. వీర్‌సాగర్, దృశ్యా రఘునాథ్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి పద్మ శ్రీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకుఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
వీర్‌సాగర్, దృశ్యా రఘునాథ్, అదితి, ఝాన్సీ, హేమ, రాజశ్రీనాయర్, ప్రియదర్శి రామ్, హేమంత్, శత్రు, భద్రమ్, మధునందన్, అజయ్ ఘోష్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి ఆర్ట్: నాని, పి.ఆర్.ఒ: వంశీ కాక, ఎడిటర్: మధు, సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, లైన్ ప్రొడ్యూసర్: బండి రత్నకుమార్, అసోసియేట్ ప్రొడ్యూసర్: టి. శ్రీనివాస్‌రెడ్డి, నిర్మాతలు: రాజు, శిరీష్, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పద్మ శ్రీ.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?