మొగలిరేకులు సాగర్ హీరోగా దర్శకుడు రమేష్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్
- October 01, 2020_1601566131.jpg)
హైదరాబాద్:అద్భుతమైన చిత్రాలకు కథ, మాటలు అందించిన రచయిత మరియు దర్శకుడు బివిఎస్.రవి మళ్లీ నిర్మాతగా మారనున్నారు, గతంలో సెకండ్ హ్యాండ్ అనే సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ కిషోర్ తిరుమలని తెలుగు చిత్ర సీమకు పరిచయం చేసిన బీవిఎస్ రవి ఇప్పుడు రమేశ్ ను దర్శకుడిగా లాంఛ్ చేస్తున్నారు.
మొగలిరేకులు సీరియల్ తో పాపులారిటీ సంపాదించుకున్న నటుడు సాగర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఎప్పటినుంచి బివిఎస్ రవికి, నటుడు సాగర్ కి సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలోనే సాగర్ ని హీరోగా మరోమారు ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తున్నారు రవి. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ప్రాధాన్యం ఉండబోతోంది. ఇంతవరకు తెలుగు చిత్ర సీమలో ఎన్నడు రాని ఓ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో ఈ సినిమాలో కథనాయక పాత్రని తీర్చిదిద్దుతున్నట్లుగా సమాచారం. ఈ చిత్ర దర్శకుడు రమేష్ గతంలో గౌతమ్ మీనన్, వైవిఎస్.చౌదరి గార్ల దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు. ఈ సినిమా గురించి మరింత సమాచారం త్వరలో చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలియనుంది. కొత్త కాన్సెప్ట్స్ తో వస్తోన్న సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తు వస్తున్నారు. అదే తరహాలో బివిఎస్.రవి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాను స్వయంగా ఒక రచయిత కావున ఈ సినిమా కథ, కథనాలు మరింత ఆసక్తికరంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?