విష్ణు మంచు చిత్రం 'మోసగాళ్లు' టీజర్ ఆవిష్కరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్
- October 03, 2020
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శనివారం ఉదయం విష్ణు మంచు హీరోగా నటిస్తోన్న 'మోసగాళ్లు' సినిమా టీజర్‌ను ఆవిష్కరించారు. మోసగాళ్లు చేసిన కుంభకోణం ఏ రేంజిలో ఉంటుందో ఈ టీజర్ తెలియజేస్తోంది.
ఇండియాలో మొదలై అమెరికాను వణికించిన 450 మిలియన్ డాలర్ల అతిపెద్ద ఐటీ స్కామ్‌కు పాల్పడినవారిని వైట్ హౌస్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ యు.ఎస్. ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో ఈ టీజర్ మొదలైంది. ఆ మీటింగ్‌లో "మిమ్మల్ని కనిపెడతాం. మిమ్మల్ని నాశనం చేస్తాం. దీనికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను, ప్రిపేర్ అయ్యాను" అని ట్రంప్ చెప్పారు.
ఆ వెంటనే కనిపించిన సీన్ ఈ ఐటీ స్కామ్ వెనుక ఉన్న మాస్టర్‌మైండ్స్ విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ అని మనకు పరిచయం చేస్తుంది. నోట్ల కట్టలు కుక్కిన బ్యాగ్‌ల మధ్య ఆ ఇద్దరూ నిల్చొని కనిపించారు. "ఇది సరిపోతుంది కదా" అని కాజల్ అంటే, "ఆట ఇప్పుడే మొదలయ్యింది" అని చెప్తున్నారు విష్ణు.
శ్యామ్ సి.ఎస్. ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. టీజర్‌లోని విజువల్స్‌ను మరింతగా ఎలివేట్ చేస్తోంది.
'మోసగాళ్లు' చేసిన అతిపెద్ద భారీ స్కామ్ ఏ రేంజిలో ఉంటుందో ఈ టీజర్ చూపించడం, దానిపై ఏకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తూ మాట్లాడటంతో, సినిమాపై ఆసక్తి బాగా పెరిగి, ఆ స్కామ్ వెనుక కథేమిటో తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతోంది. ఈ టీజర్‌తో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరిగాయి.
'మోసగాళ్లు' చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల కానున్నది.
విష్ణు మంచు లీడ్ రోల్ చేస్తూ నిర్మిస్తోన్న ఈ సినిమాని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. విష్ణు సోదరిగా కాజల్ అగర్వాల్ కనిపించనుండటం ఈ చిత్రంలోని విశేషం. తెరపై ఆ ఇద్దరి కెమిస్ట్రీ సూపర్బ్‌గా ఉన్నట్లు టీజర్‌తోనే అర్థమైపోతోంది.
బాలీవుడ్ సీనియర్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు.
తారాగణం:
విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర, రుహీ సింగ్
సాంకేతిక బృందం:
సినిమాటోగ్రఫీ: షెల్డన్ చౌ
ప్రొడక్షన్ డిజైన్: కిరణ్‌కుమార్ ఎం.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ ఆర్.
నిర్మాత: విష్ణు మంచు
దర్శకత్వం: జెఫ్రీ గీ చిన్
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







