మిలిటరీ హాస్పిటల్ కు ట్రంప్..
- October 03, 2020
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా మహమ్మారి బారినపడ్డ విషయం తెలిసిందే. పాజిటివ్‌గా పరీక్షించినప్పటి నుంచి శ్వేతసౌధంలో క్వారంటైన్‌లోనే ఉన్న ఆయన వైద్యుల సూచనల మేరకు ఎట్టకేలకు శుక్రవారం దవాఖానలో చేరారు. సాయంత్రం వైట్‌హౌస్ మాస్క్ ధరించి, హెలీకాప్టర్ ద్వారా వాల్టర్ రీడ్ సైనిక హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనుండగా కొద్ది రోజులు ట్రంప్ ప్రచారానికి దూరం కానున్నారు. ఈ సందర్భంగా ఆయన వైట్‌హౌస్‌లో రిక్డార్ చేసిన సెకెన్ల వీడియో ట్విట్టర్‌లో విడుదల చేశారు. తాను, ప్రథమ మహిళ మెలనియా ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. 'నాకు మద్దతుగా నిలుస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. నేను వాల్టర్ రీడ్ హాస్పిటల్‌కు వెళ్తున్నాను. నాకు తెలిసి నేను బాగానే ఉన్నాను. అయినా, అన్నీ సవ్యంగా ఉండాలనే మేం ఆసుపత్రికి వెళ్తున్నాం. ప్రథమ మహిళ కూడా బాగానే ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. నేను ఇది ఎప్పటికీ మర్చిపోలేను' అని వీడియో సందేశంలో ట్రంప్ అన్నారు.
ట్రంప్‌కు ఇస్తున్న మందులు ఇవీ..
కొవిడ్-19 నుంచి బారి నుంచి అధ్యక్షుడికి ఇస్తున్న మందుల జాబితాను ఆయన వ్యక్తిగత వైద్యుడు సీన్ కాన్లే వెల్లడించారు. 'అధ్యక్షుడికి వైరస్ సోకినట్లు పీసీఆర్‌లో నిర్ధారణ అయిన తర్వాత.. ముందు జాగ్రత్తగా రెజెనెరాన్స్‌కు చెందిన 8 గ్రాముల డోసు గల పాలీక్లోనల్ యాంటీబాడీ కాక్‌టెయిల్ ఇచ్చారు. అలాగే జింక్, విటమిన్ 'డీ', ఫామోనిటిడైన్, ఆస్పిరిన్, మెలటోనిన్ తీసుకున్నారని' ఒక ప్రకటనలో తెలిపారు. పాలీక్లోనల్ యాంటీబాడీ కాక్‌టెయిల్ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలోనే ఉండడం గమనార్హం. ఇది కొవిడ్ లక్షణాలు మరింత ముదరకుండా రక్షిస్తుందని భావిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నానికి కొంత అలసినట్లు కనిపించినా.. ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. ప్రథమ మహిళకు స్వల్ప తలనొప్పి, దగ్గు మినహా పెద్ద లక్షణాలేమీ లేవని తెలిపారు. మిగతా కుటుంబ సభ్యులందరికీ నెగెటివ్ వచ్చినట్లు వివరించారు.
ట్రంప్ ప్రచారానికి దెబ్బ..
అమెరికా అధ్యక్షుడిగా మరోసారి బరిలో నిలిచిన ట్రంప్ కరోనా బారిన పడడంతో ప్రచారానికి తెరపడింది. ప్రత్యర్థి జోబిడెన్ కంటే ఇప్పటికే ఆయన వెనుకపడ్డారు. శుక్రవారం ఫ్లోరిడాలో ర్యాలీని రద్దు చేశారు. విస్కాన్సిన్‌లో శనివారం, వచ్చే వారం అరిజోనా వంటి పశ్చిమ రాష్ట్రాల్లో ఇతరులు ర్యాలీని రద్దు చేయడం మొదలుపెట్టి అధ్యక్షుడితో సంబంధం ఉన్న అన్ని ప్రణాళిక కార్యక్రమాలు వాయిదా వేయడం, లేదంటే వర్చువల్‌గా నిర్వహించే అవకాశం ఉందని ట్రంప్ వర్గం తెలిపింది. అక్టోబర్ 15న జరగాల్సిన రెండో ట్రంప్-బిడెన్ చర్చ వేదిక జరుగుతుందా?లేదా? సందేహంగా ఉంది. గత నెలాఖరులో ఇద్దరు చర్చావేదికలో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!