ఆందోళనకరంగా ట్రంప్ ఆరోగ్యం
- October 04, 2020
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(74) కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన మిలటరీ ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ఆందోళణకరంగా ఉన్నట్లు సమాచారం. ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ట్రంప్‌కు స్థూలకాయం, కొలెస్టరాల్ ఎక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం ఆయనకు రెమ్డెసీవీర్తో పాటు యాంటీబాడీలతో వైద్యం అందిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో ఆయన కీలక అవయవాల పనితీరు ఆందోళనకరంగా మారింది. రాబోయే రెండు రోజుల్లో ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చాలా కీలకమైనవిగా భావిస్తున్నారు. ట్రంప్ మరికొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి రావచ్చని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. అధ్యక్ష ఎన్నికలకు నెలరోజుల సమయం ఉన్న తరుణంలో కరోనా బారిన పడడం డొనాల్డ్ ట్రంప్ ప్రచారంపై ప్రభావం చూపుతోంది. ట్రంప్ ప్రత్యర్థి జో బిడెన్ ప్రచారంలో దూసుకపోతున్నారు. ఇప్పటికే అమెరికాలో బ్యాలెట్ ఓటింగ్ ఆరంభమైంది. కరోనాను తేలిగ్గా అంచనా వేసి ట్రంప్ దెబ్బతిన్నారని, అమెరికాను రిస్కులో పెట్టారని డెమొక్రాట్లు విమర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..