సౌదీ ఎడ్యుకేషన్ క్యాంప్‌లో దాడి, ఆరుగురి మృతి
- February 12, 2016
సౌదీ అరేబియాలోని ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కార్యాలయంలో ఓ వ్యక్తి ఆరుగురు ఉద్యోగులను హతమార్చాడు. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ దాడిని అత్యంత క్రూరమైన దాడిగా అభివర్ణించింది. ఓ టీచర్, ఆరుగురు సహచరుల్ని చంపేసినట్లుగా తెలియవస్తోంది. మరో ఇద్దరు ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలయ్యారు. అద్ దయర్‌లోని రిమోట్ కమ్యూనిటీలో ఈ దాడి జరిగింది. ఎమెని బోర్డర్‌కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. దాడికి పాల్పడింది ఎవరు? అన్నదానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. టీచర్ల సహోద్యోగి అని కొన్ని వార్తలు వస్తుండగా, బయట నుంచి వచ్చిన వ్యక్తి దారుణానికి ఒడిగట్టినట్లుగా ఇంకొన్ని వార్తలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







